Heavy Rains: వర్షాలకు అతలాకుతలం అవుతున్న కామారెడ్డి.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు కామరెడ్డి మునిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు కామరెడ్డిలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.

New Update
Railway track

Railway track

Heavy Rains:

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణలో అతి భారీ వర్షాలు(Telangana Rains) కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కామారెడ్డి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేశారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో(Kamareddy) ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు కామరెడ్డి మునిగింది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు ఎక్కడక్కడ నీరు స్తంభించిపోయింది. భారీ వర్షాలకు కామరెడ్డిలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది(Railway Track in Kamareddy Washed Away). అలాగే వీధుల్లో ఉన్న కార్లు, బైక్‌లు వర్షాలకు కొట్టుకుపోతున్నాయి.

ఇది కూడా చూడండి: Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్..  మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

లోతట్టు ప్రాంతాల వారు వరదల్లో చిక్కుకున్నారు. అయితే హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. హైద‌రాబాద్  న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాల‌ని సీఎం ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లతో భ‌క్తుల‌కు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల‌ని సీఎం పేర్కొన్నారు.

న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు నుంచి నీటి ప్రవాహాలు ఉంటాయి.ఈ ప్రాంతాల నుంచి రాకపోకలు నిషేధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే నీటి పారుద‌ల శాఖ అధికారులు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఇది కూడా చూడండి: Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి వెళ్లి.. క్యూలైన్లో మహిళ ప్రసవం!

Advertisment
తాజా కథనాలు