/rtv/media/media_files/2025/08/27/heavy-rains-2025-08-27-15-32-57.jpg)
Heavy Rains
Kamareddy: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను భారీవర్షాలు కుదిపేస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జిల్లాలోని ఆర్గొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా నాగాపూర్‌లో 20.88 సెం.మీ వర్షపాతం నమోదైంది.భారీ వర్షాలతో కామారెడ్డి అతలాకుతలమైంది. జిల్లాలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. పట్టణాన్ని భారీ వరద ముంచెత్తింది.పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక కార్లు కొట్టుకుపోయాయి.
Also Read: హిందూమహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ X రాకెట్.. ఇండియాకి ప్రమాదమా?
హౌసింగ్ బోర్డు కాలనీని వరద ముంచెత్తింది.కామారెడ్డిలో పెద్ద చెరువు పొంగిపొర్లుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలో ఉన్న కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి మూసివేశారు. మెదక్‌లోనూ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. మెదక్ జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్‌లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత వర్షం కురిసింది.ఎగువ మానేరుకు భారీగా వరద పోటెత్తింది. గంభీరావుపేటలో మానేరు వాగులో చిక్కుకున్న ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు.
భారీ వర్షాల దృష్ట్యా కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు జిల్లాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!
మరో రెండు గంటల్లో కుండపోత
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండుగ వాతావరణం లేకుండా పోయింది. రోడ్లన్నీ జలమయమవ్వడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని. ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు