MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మామపై కేసు..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయ్యింది ఓ స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయ్యింది ఓ స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కవిత. రాష్ట్రం నుంచి 8మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. పరిశ్రమ కొరకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు.
గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కు లేదని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. హైడ్రాతో హైదరాబాద్ రియల్ఎస్టేట్ను నాశనం చేశారని మండిపడ్డారు. హామీలను విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.
డబ్బుల కోసం కన్న తల్లే ముగ్గురు పిల్లలను అమ్మేసిన దారుణ ఘటన నిజమాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం రావడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. బిడ్డలను విక్రయించినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
TG: కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారని ఫైరయ్యారు. వెంటనే ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావాల్సిందే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సోహెల్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
TG: రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
TG: కేసీఆర్ను ఇరుకున పెట్టె అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు మంజూరు చేశారంటూ పలు కీలక పత్రాలను విడుదల చేసింది.