MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మామపై కేసు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయ్యింది ఓ స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

New Update
KAVITHA

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయ్యింది. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య  గొడవలు జరుగుతున్నాయి.

Also Read: Ganja Lady Don: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు

ఈ వ్యవహారంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ఎస్‌హెచ్‌వో మహమ్మద్‌ ఆరీఫ్‌ తెలిపారు. కాగా, ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంటు ఎదుట ఉన్న రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడినట్లు అపార్ట్‌మెంట్ వాసి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: Marri Janardhan reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

వారు తమను కులం పేరుతో దూషించారని, అంతు చూస్తానంటూ కిషన్ రావు అనుచరులు బెదిరించి దాడికి పాల్పడ్డారని చెప్పారు. దీంతో రామ్‌కిషన్‌ రావు, మాజీ కార్పొరేటర్‌ భర్త సుదామ్‌ రామ్‌చంద్, నగేశ్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్టు ప్రకటించారు.

Also Read: బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్‌ నుంచి తెప్పించి..

ఇదిలా ఉంచితే, ఈ స్థలం తమదంటూ మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ వాదిస్తున్నారు. తాము రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ తమపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, అది తన సొంత స్థలం అని నగేశ్‌ కుమార్‌ అంటున్నారు. ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. 

Also Read: Ap: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!

ఈ స్థలంతో రామ్‌కిషన్‌ రావుకు అసలు సంబంధమే లేదని ఆయన అన్నారు. ఈ మేరకు నగేశ్‌ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ కిషన్ రావు, అపార్ట్‌మెంట్‌ వాసి గోపితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు