Rain Alert: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

TG: రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

New Update
Rains

Telangana Rains: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు  వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి పంజా దాటికి ప్రజలు అనారోగ్య భారిన పడి ఆసుపత్రిలలో చేరుతున్నారు. ఇదిలా ఉంటే పంట కోతకు వచ్చిన సమయంలో చావు వార్త చల్లగా చెప్పినట్టు వాతావరణ శాఖ వర్షాలపై ప్రకటన చేయడం రైతులలో ఆందోళన కలిగిస్తోంది.

ఇది కూడా చదవండి: Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి!

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్...

వర్ష పాతం ఎక్కువ నమోదు అయ్యే జిల్లాలకు వాతావరణ షాక్ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే రేపు, ఎల్లుండి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు ఇచ్చింది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండలని సూచించింది.

ఇది కూడా చదవండి: రాజకీయాలు బ్రేక్.. కేటీఆర్ సంచలన నిర్ణయం!

ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ చేస్తే ఇంటి వద్దకే..!

ఇది కూడా చదవండి: AP crime: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు