MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. ఇకపై!

TG: కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ప్రజలను కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారని ఫైరయ్యారు. వెంటనే ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు.

New Update
KAVITHA

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కవిత. ఈరోజు తెలంగాణ జాగృతి నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. బూటకపు హామీలతో తెలంగాణ యువతను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. యువకులకు ఇచ్చిన హామీలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. హామీలు ఏమైయ్యాయని కాంగ్రెస్ పార్టీ నాయకులను గట్టిగా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి...

ఎన్నికల సమయంలో కాంగ్రెస్.. యువ వికాసం కింద రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, విద్య జ్యోతుల పథకం కింద ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పి ఓట్లు దండుకుందని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి ప్రస్తావనే చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. అలాగే, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న బీసీలకు 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ... కనీసం అసలు రియింబర్స్‌మెంట్ మొత్తాన్నే ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. 

Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!

ఫీజు రియింబర్స్ రాక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న నియామక లెక్కల్లో అనేక వాటికి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పరీక్షలు జరిగాయని గుర్తు చేశారు. మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పటి నుంచి చెల్లిస్తారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లీటర్ పెట్రోలు రూ. 40 కే ఇస్తామన్న హామీ ఎప్పుడు అమలు చేస్తారని అడిగారు. విద్యార్థినులకు  స్కూటి ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విషాహారం తిని మరణించిన  శైలజ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు కవిత.

Also Read: శ్రీతేజ్ కుటుంబానికి అండగా 'పుష్ప2' టీమ్.. హాస్పిటల్ వెళ్లిన బన్నీ

Also Read: బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం.. వీడియో చూశారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు