/rtv/media/media_files/2024/11/02/JYa2PpmIKzxivGzoBDzc.jpg)
KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టె అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లోని ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు మంజూరు చేశారంటూ పలు కీలక పత్రాలను విడుదల చేసింది. పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు కేబినేట్ ను ఒప్పించిందే కేసీఆర్ అని పేర్కొంది.
ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!
కేసీఆర్ ఒత్తిడి...
తెలంగాణలో లగచర్ల ఘటన మరువకముందే దిలావర్‌పూర్ ఇథనాల్ కంపెనీ అంశం కలకలం రేపింది. తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ అక్కడి స్థానిక గ్రామస్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కంపెనీకి సంబంధించి వాస్తవాలను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు ఇచ్చినట్లు ఆధారాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది. ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తులకు అప్పటి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆధారాలను బయటపెట్టింది.
ఇది కూడా చదవండి: BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!
ఈ కంపెనీ ఏర్పాటు కోసం స్థానిక ప్రజల నుంచి అభిప్రాయ సేకరణను గత ప్రభుత్వం చేపట్టలేదని తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది. 2022 అక్టోబర్ 22న గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసినట్లు వెల్లడించింది. కాగా దీనిపై ప్రభుత్వ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఆధారాలపై బీఆర్ఎస్ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!
దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన అనుమతులన్నీ ఇచ్చింది @KCRBRSPresident. ...!!
— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) November 29, 2024
అప్పటి మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇప్పించిందే కేసీఆర్.
పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు కేబినేట్ ను ఒప్పించిందే కేసీఆర్.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ ఫ్యాక్టరీకి… pic.twitter.com/QNvyw1Q9p0
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!