TG News: చిన్నారిని పీక్కుతున్న వీధి కుక్కలు.. తెలంగాణలో మరో దారుణం!
బోధన్ పట్టణంలో వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెట్టు కింద ఉన్న చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో మాంసపు ముద్దలను గుర్తించారు. బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు.