AICC: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్!

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

New Update
Jeevan Reddy

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆయనను మరోసారి బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే హైకమాండ్ ఈ మేరకు తీర్మానం చేసి హైకమాండ్ కు పంపించింది. ఈ అంశంపై జీవన్ రెడ్డి సైతం స్పందించారు. పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే బరిలో ఉంటానన్నారు. జీవన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే 4 జిల్లాల నేతలతో టీపీసీసీ చీఫ్‌ సమావేశం నిర్వహించారు. జీవన్ రెడ్డి పోటీకి సంబంధించి ఆయా జిల్లాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 

Also Read :  విజయవాడలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు వల్ల ఎన్నో ఇబ్బందులు!

ఎమ్మెల్యేగా, మంత్రిగా..

జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా సైతం పని చేశారు. 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. అయితే.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే.. అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఆయనను బరిలోకి దించింది. 

Also Read :  పార్టీలో బాలీవుడ్ హీరోతో డాన్స్ ఇరగదీసిన సమంత.. వీడియో వైరల్

ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే.. అనంతరం జగిత్యాలలో ఆయనపై బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై సైతం పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో ఆయన పార్టీ వీడుతారన్న చర్చ కూడా సాగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనతో అనేక సార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయనను మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Also Read :  అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా?

Also Read :  మల్లారెడ్డి కాలేజీలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు