మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశం

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావాల్సిందే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సోహెల్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
Bodhan Ex MLA Shakeel

మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణకు సోహెల్ హాజరు కావాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ముందు షకీల్ కొడుకు సోహెల్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

ఏం జరిగింది..?

డిసెంబర్ 23న ప్రజాభవన్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు భారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ముగ్గురు యువతులు ఉన్నట్లు తెలిసింది. ఆ కారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ దని తేలింది. వీళ్లంతా స్టూడెంట్స్ అని.. కారు డ్రైవ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని కన్ఫామ్ చేశారు పోలీసులు.

యాక్సిడెంట్ జరిగిన తర్వాత షకీల్‌ ఇంట్లో డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి.. తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని వెల్లడించారు. షకీల్ డ్రైవర్ పోలీసుల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని.. కానీ సీసీ ఫుటేజీ ద్వారా సోహెల్‌ కారు నడిపినట్లు గుర్తించినట్లు చెప్పారు. మద్యం మత్తులో బారికేడ్లను ఢీకొట్టారని తెలిపారు.

అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎఫ్‌ఐఆర్‌లో సోహెల్ పేరును పోలీసులు నమోదు చేయలేదు. దీంతో ఈ కేసుపై పలు విమర్శలు రావడంతో పంజాగుట్ట సీఐని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. అయితే పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ నుంచి సోహెల్ తప్పించుకున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత సోహెల్ దుబాయ్ పారిపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

ఈ ఏడాది జనవరిలో ఈ కేసును విచారించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోహెల్‌ను అరెస్ట్ చెయ్యొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా జనవరి 17 న సోహెల్ పోలీసుల ముందు హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణ జనవరి 24 కు వాయిదా వేసింది. 

అనతరం ఈ కారు ప్రమాదం కేసులో సోహెల్ క్వాష్ పిటిషన్ వేసాడు. యాక్సిడెంట్‌తో తనకేం సంబంధం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. తన మీద తప్పుడు కేసు పెట్టారంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. 

Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

యాక్సిడెంట్‌తో తనకేం సంబంధం లేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులు కావాలనే తన పేరును నిందితుడిగా పెట్టారని అన్నాడు. ఇలా జరిగిన అనంతరం ఇప్పుడు హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న సోహెల్ హైదరాబాద్‌కు రావాల్సిందే హైకోర్టు ఆదేశాన్నిచ్చింది.

Also Read: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్

Advertisment
Advertisment
తాజా కథనాలు