చూడ్డానికి తాత వయసుంటాడు. మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కారణంతో గ్రామస్థులంతా ఒక్కటై ఆ వృద్ధుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ దెబ్బలు తట్టుకోలేక అతడు మరణించాడు. ప్రస్తుతం ఈ రచ్చ ఆ గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు ఏం జరిగిందంటే? నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో దారుణం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక సరుకులు కొనేందుకు కిరాణా షాపుకి వెళ్లింది. అక్కడ షాప్ నిర్వాహకుడు అయిన వృద్ధుడు ఆ బాలికపై కన్నేసినట్లు తెలిసింది. దీంతో అదే సమయంలో ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు సమాచారం. Also Read: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు ఇక అక్కడ జరిగిందంతా ఆ బాలిక ఇంటికెళ్లి తన అమ్మ నాన్నలతో చెప్పగా.. ఊరు ఊరంతా ఈ విషయం పాకింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా ఒక్కటయ్యారు. ఎలాగైనా ఆ వృద్ధుడికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్థులంతా ఒక్కటై ఆ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో తీవ్ర గాయాలపాలయ్యాడు. Also Read: బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్ నుంచి తెప్పించి.. అనంతరం ఇంకొందరు అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ దెబ్బలు గట్టిగా తగలడంతో ఆ వృద్ధుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ గ్రామానికి చెందిన కొందరు తగిన గుణంపాఠం జరిగిందని అంటుంటే.. మరికొందరు మాత్రం ఇది న్యాయవ్యవస్థకే అప్పగించాల్సి ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పికెట్‌లు ఏర్పాటు చేశారు. . . . Also Read: ఏపీ పై అల్పపీడన ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త!