/rtv/media/media_files/2026/02/02/fotojet-24-2026-02-02-19-09-19.jpg)
Father Kills Daughter
Father Kills Daughter : తల్లికి మగపిల్లలు, తండ్రికి ఆడపిల్లలంటే ఇష్టముంటుందని చెప్తారు. అలాంటిది ఆ తండ్రి చేసిన పనికి దేశమంతా ఒక్కసారిగా విస్తుపోయింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే అభం శుభం తెలియని తన కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్ధేశంతో అని తెలియడం తీవ్ర కలకలం రేపింది. సర్పంచ్ పదవి వ్యామోహం ముందు కన్న ప్రేమ చిన్నబోయింది. ఎన్నికల్లో పోటీకి అడ్డుగా మారిందని కన్నకూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు ఆ కసాయి తండ్రి. పెంచిన ప్రేమను మర్చిపోయి కూతురిని హతమార్చిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు అందరిని కలిచివేస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖెడ్ మండలం కేరూర్ గ్రామానికి చెందిన పాండురంగ అనే వ్యక్తి అక్కడ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‍గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండదని భావించాడు. దీంతో ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముగ్గురు పిల్లల్లో ఒకరి అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. ప్రస్తుత సర్పంచ్ గణేశ్ షిండే సలహా అడిగితే ఆయన ఓ దారుణమైన సలహా ఇచ్చాడు.
ఆయన సలహా మేరకు పాండురంగ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆరేళ్ల పెద్ద కూతురు ప్రాచీని బైక్‌పై తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ARP క్యాంప్ శివారులో హత్య చేశాడు. అనంతరం ఆ శవాన్ని డి46 కెనాల్‍లో పడేశాడు. కెనాల్‌లో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని బయటకు తీసి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే పాప విషయంలో తండ్రి పొంతన లేని మాటలు చెబుతుండటంతో తమదైన స్టైల్లో విచారించారు. విచారణలో కన్న తండ్రే హంతకుడని తేలింది. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీయగా ఘోరం వెలుగు చూసింది. పాండురంగ్‌తో పాటు అతనికి సహకరించిన గణేష్ షిండేను అరెస్ట్ చేశారు. బాలికను తీసుకువచ్చేందుకు ఉపయోగించిన బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు.
Follow Us