/rtv/media/media_files/2025/11/17/nizamabad-7th-class-girl-kidnapping-drama-2025-11-17-18-37-06.jpg)
Nizamabad 7th class Girl kidnapping drama
‘‘అమ్మా నన్ను ఎవరో కిడ్నాప్ చేయాలని చూశారు. స్కూల్‌కి వెళ్తుండగా కారులో వచ్చి నన్ను బలవంతంగా లోపలకి ఎక్కించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారి నుంచి తప్పించుకుని వచ్చేశాను.’’ అంటూ ఏడో తరగతి విద్యార్థిని తన తల్లి దండ్రులకు చెప్పింది.
Nizamabad 7th class Girl kidnapping
ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించడంతో భయబ్రాంతులకు గురైన పేరెంట్స్ వెంటనే పోలీసులకు తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థిని స్కూల్‌కు వెళ్లే దారి గుండా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరికి ఆ బాలిక చేసిన పనికి అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ బాలిక ఏం చేసింది?.. ఆమె చెప్పిందంతా నిజమేనా..? పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్‌లో ఏం కనిపించింది?.. నిందితులను పట్టుకున్నారా? అనే పలు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైమది బజార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక 7వ తరగతి చదువుతోంది. ఆమె ఉదయం స్కూల్‌కు వెళ్తుండగా.. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కారులో వచ్చి తనను కిడ్నాప్ చేసినట్లు పేరెంట్స్‌కు తెలిపింది. కొంత దూరం వెళ్లిన తర్వాత వారినుంచి ఎలాగోలా తప్పించుకున్నానని పేర్కొంది. ఈ ఘటనపై బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేయగా పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.
దీంతో నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో నగర CI శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో రెండో టౌన్ SI సయ్యద్ ముజాహిద్ సిబ్బందితో కలిసి పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. బాలిక ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లే మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులో ఎక్కడా కూడా కారులో వచ్చి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ లేవు. వెంటనే సీఐ శ్రీనివాస్ బాలిక, ఆమె పేరెంట్స్‌తో మాట్లాడారు.
ఆ సమయంలో బాలిక పొంతన లేని సమాధానాలు చెప్పింది. ఆమె సమాధానాలతో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. బాలికపై ఎలాంటి కిడ్నాప్ యత్నం జరగలేదని సీఐ తెలిపారు. అదే సమయంలో ఆ బాలిక ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందోనన్న విషయాన్ని పోలీసుల విచారణలో తేలింది. ఆమె స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక తన తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి కిడ్నాప్ డ్రామా ఆడిందని సీఐ చెప్పారు. ఇలా చేస్తే తనను స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండమంటారని భావించి ఆ బాలిక ఇలాంటి పని చేసిందని ఆయన తెలిపారు. అసలు కిడ్నాప్ యత్నం అనే ఘటన జరగలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏమైనా ఉంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Follow Us