/rtv/media/media_files/2026/03/04/telangana-university-2026-03-04-10-37-04.jpg)
Students Clash In Telangana University in Kamareddy
తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జూనియర్, సీనియర్ విద్యార్థులు పోట్లాడుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని వర్సిటీ సౌత్ క్యాంపస్ హాస్టల్‌లో మంగళవారం రాత్రి విద్యార్థులు హోలీ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత సీనియర్, జూనియర్ విద్యార్థులకు మనస్పర్థలు రావడంతో రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.
Also Read: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..
Students Clash In Telangana University
ఈ పోట్లాటలో కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న వర్సిటీ సిబ్బంది అక్కడికి వచ్చారు. గొడవను ఆపి విద్యార్థులను చెదరగొట్టారు. అలాగే గాయాలపాలైన విద్యార్థులకు చికిత్స అందించారు. హాస్టల్ వద్దకు స్థానిక ఎస్సై ఆంజనేయులు, వార్డెన్ డా.యాలాద్రి కూడా అక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read: గూడెం మహిపాల్ రెడ్డికి బిగ్‌షాక్.. ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌పై వేటు
Follow Us