/rtv/media/media_files/2026/01/10/fotojet-2026-01-10t100017-2026-01-10-10-00-43.jpg)
Azharuddin as Nizamabad local MLC candidate?
Azharuddin: జూబ్లీహిల్స్ ఎన్నికల(jubilee hills elections) సమయంలో పోటీదారుల మధ్య సమస్యను పరిష్కరించడం కోసం గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన అజారుద్దీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రి పదవి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఏ సభలో సభ్యుడి కానీ అజారుద్దీన్‌కు మంత్రిపదవి కేటాయించడంతో ఆరునెలల్లో ఏదో ఒక సభలో ఆయనకు అవకాశం కల్పించాల్సి ఉంది. నిజానికి ఎమ్మెల్సీ అవకాశం లేకపోవడంతో అజారుద్దీన్ మంత్రి పదవి ఊస్ట్ అనే ప్రచారం సాగింది. అయితే బీఆర్‌ఎస్ తో విభేదించి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(brs-mlc-kavitha) తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించింది. తాజాగా ఖాళీ అయిన స్థానంలో అజారుద్దీన్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించడమే దీనికి కారణం.
Also Read : గాలిలో పతంగుల జోరు... చైనా మాంజాతో ప్రాణాలు బేజారు
Azharuddin As Nizamabad Local MLC Candidate
కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మంత్రి అజారుద్దీన్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు ముందుజాగ్రత్త గా నిజామాబాద్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో.. ఆమె ప్రాతినిధ్యం వహించిన ‘నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ’ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. మరోవైపు గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేయడంతో గవర్నర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే ఈ విషయంలో ఆలస్యమైనా గవర్నర్ ఆమోదం లభిస్తుందన్న నమ్మకంతో అజారుద్దీన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ, అదీ జరగలేదు. గత ఏడాది అక్టోబరు 31న ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. నిబంధనల ప్రకారం ఆరు నెలలోగా అంటే ఏప్రిల్ 31 కల్లా శాసనసభ లేదా మండలిలో సభ్యుడు కావాలి. లేకుంటే మంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది. అయితే ఈ లోపే నిజామాబాద్ స్థానానికి కవిత రాజీనామా చేయడం రేవంత్‌కు కలిచివచ్చింది. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్‌ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని, దానితో ‘స్థానిక’ ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తేలికేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
అయితే కవిత రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించడానికి ఆరునెలల సమయం ఉంది. అయితే దానికి ముందే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల తర్వాతే ఈ సీటుకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలే అందులో ఓటర్లుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పరిషత్తుల కాలపరిమితి ముగిసి చాలాకాలం అయింది. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అవి పూర్తవగానే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి, ఉప ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపనుంది. పరిషత్ ఓటర్లు లేకున్నా.. మున్సిపల్ ఓటర్లతో ఉప ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అజారుద్దీన్ ఎన్నిక ఇక లాంఛనమే అన్న ప్రచారం సాగతోంది.
Also Read : కొల్లూరులో అర్ధరాత్రి భూ మాఫియా వీరంగం..సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి..
Follow Us