Kamareddy :  కామారెడ్డి జిల్లాలో విషాదం..చెరువులో శవాలై తేలిన అదృశ్యమైన చిన్నారులు

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు చెరువులో శవాలై తేలడం తీవ్ర కలకలం రేపింది. కాగా వారి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులంతా ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో  జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది.

New Update
FotoJet (20)

Kamareddy children missing

Kamareddy : కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు చెరువులో శవాలై తేలడం తీవ్ర కలకలం రేపింది. కాగా వారి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులంతా ఎనిమిది సంవత్సరాల లోపు వారే కావడంతో జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్(auto-driver) కు సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) ముగ్గురు పిల్లలు ఉన్నారు.  వారు ముగ్గురు శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. అయితే తండ్రి వారిని ఆటోలో తీసుకెళ్లి తమ షాపు వద్ద వదిలేసినట్లు చెబుతున్నారు. కానీ, తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు అందోళనకు గురయ్యారు. ఊరంతా గాలించారు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో  పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని పెద్ద చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి.  

Also Read :  వంట విషయంలో అత్తతో గొడవ : టెక్కీ సూసైడ్.. భర్త అరెస్ట్!

Missing Children Found Dead In Pond

కాగా ఈ ఘటనపై  వారి తండ్రి  పొంతనలేని విధంగా పోలీసులకు సమాధానమిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ అయిన అతడు.. ఉదయం తన ఆటోలో పిల్లలను వారి షాపు వద్ద దింపేసి.. కిరాయికి వెళ్లినట్టు తండ్రి చెబుతున్నాడు. ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరూ చెరువులో విగత జీవులుగా కనిపించడంపై అనుమానం వచ్చి అతడిని ప్రశ్నించగా.. పిల్లలు ఆడుకుంటూ వెళ్లి చెరువులో పడి ఉంటారని చెప్పడం గమనార్హం. దాంతో.. అతడిని మరింత విచారిస్తే చిన్నారుల మృతి మిస్టరీ వీడుతుందని పోలీసులు భావించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా కామారెడ్డిలో గత రెండు రోజులుగా చిన్నారులు వరుసగా అదృశ్యం అవుతున్నారు.. దీంతో చిన్నారుల ఆత్మీయులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (9) అనే ఇద్దరు బాలురు కూడా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వారి కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా జిల్లాలో వరుసగా చిన్నారులు కనిపించకుండా పోవడం స్థానికుల్లో భయాందోళనలు కలిగిస్తోంది. చిన్నారుల అదృశ్యాలపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read :  ఓరి దుర్మార్గులారా.. అంబులెన్స్‌లో రక్తానికి బదులు ఫారిన్ లిక్కర్ స్మగ్లింగ్

Advertisment
తాజా కథనాలు