/rtv/media/media_files/2026/01/04/a-father-commits-suicide-in-kamareddy-district-2026-01-04-21-48-56.jpg)
A father commits suicide in kamareddy-district
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య, బిడ్డలను పోషించలేక ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీర్కూర్ మండలం వీరాపూర్‌దుబ్బాకు చెందిన ప్రహ్లాద్(30) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సౌందర్యతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు కుమార్తెలు స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) సంతానం.
Also Read: వారికి రైతు భరోసా కట్.. రైతులకు ఊహించని షాక్.
ప్రహ్లాద్ రోజూవారి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే తమకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని.. వాళ్లని ఎలా చదివించాలి? వివాహాలు చేయాలని తరచూ బాధపడుతూ ఉండేవాడు. ప్రస్తుతం సౌందర్య 9 నెలల గర్భిణి. జనవరి 26 లోపు డెలివరీ కావాల్సి ఉంది. అయితే నాలుగో సంతానం కూడా కూతురు పుడుతుందనే భయంతో శనివారం మధ్యాహ్నం ప్రహ్లాద్ కుటుంబ సభ్యుల ముందే విషం తాగారు. వారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి సీరియస్ కావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లారు.
Also Read: ట్రంప్‌లా మోదీ ఎందుకు చేయలేదు.. వెనిజులా ఘటనపై ఒవైసీ రియాక్షన్!
అక్కడ చికిత్స తీసుకుంటూ అదేరోజు రాత్రి ప్రహ్లాద్ మృతి చెందారు. ఆదివారం మృతదేహానికి శవపరీక్ష చేసి కుటుంబీలకు అప్పగించారు. అంతేకాదు గతంలో కూడా ప్రహ్లాద్ మూడుసార్లు సూసైడ్‌కు యత్నించాడని.. ఆ సమయంలో తామే కాపాడామని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు.
Follow Us