Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో విషాదం..ఆటోనుంచి పడి విద్యార్థిని మృతి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎనిమిదో తరగతి చదువుతున్న సంగీత అనే బాలిక ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో జిల్లాలో విషాదం నెలకొంది.

New Update
FotoJet (10)

Tragedy in Kamareddy district.. Student dies after falling from auto

కామారెడ్డి జిల్లా(kamareddy-district) లో విషాదం చోటుచేసుకుంది. రిపబ్లిక్ డే వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లు ఒక విద్యార్థిని ప్రాణాల్ని బలితీసుకున్నాయి. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది.పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎనిమిదో తరగతి చదువుతున్న సంగీత అనే బాలిక ప్రమాదవశాత్తు మరణించింది.

Also Read :  TG TET 2026: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇక ఆ ప్రాసెస్ కు బ్రేక్!

సోమవారం జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల కోసం పాఠశాల ఆవరణలో ఫర్నిచర్ అవసరమైంది. అయితే పాఠశాలకు సంబంధించిన విద్యార్థినీలు ఒక ఆటోలో కుర్చీలను తరలించారు. అయితే ఆటో డ్రైవర్ పాఠశాల ఆవరణలో ఆటో ఆపకుండా వెళ్లడంతో భయంతో పలువురు విద్యార్థినీలు ఆటో నుండి దూకేశారు. అందులో సంగీత అనే విద్యార్థినీ కింద దూకిన సమయంలో తలకు గాయమై అక్కడికక్కడే మరణించింది. అయితే ఈ ఘటన పై భిన్న వాదనలు వినవస్తున్నాయి. బోర్లం గురుకుల స్కూల్ ప్రిన్సిపల్ పాఠశాలకు సంబంధించిన పర్నీచర్ ను ఆమె తన ఇంటిలో జరిగిన పూజకోసం తీసుకెళ్లి తన అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సోమవార రిపబ్లిక్ డే ఉండటంతో అధికారులు, స్థానికులు పాఠశాలకు వచ్చే అవకాశం ఉండటంతో తన ఇంట్లో ఉన్న కుర్చీలను పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఆటోలో విద్యార్థినీలను తీసుకెళ్లింది. ఈ క్రమంలో వారు ఆటోలో పాఠశాలకు తిరిగి వస్తుండగా పాఠశాల సమీపంలో ఆటో ఆపకుండా వేగంగా వెళ్లడంలో భయంతో పలువురు విద్యార్థినీలు ఆటో నుంచి దూకారు. అలా దూకినవారిలో సంగీతకు తీవ్రగాయలు కావడంతో తోటి విద్యార్థినీలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంగీత చనిపోయింది. 
కాగా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపల్ సునీత స్కూల్ పర్నీచర్ ను తన ఇంటికి ఎందుకు తరలించారు. అలాగే దాన్ని తీసుకురావడానికి రాత్రిపూట విద్యార్థులను ఎలా పంపించారు. ఆటో డ్రైవర్ ఆటో ఎందుకు ఆపలేదు. వారిపట్ల అసభ్యంగా ఏమైనా ప్రవర్తించడంతో భయంతో వారు ఆటో దూకారా లేక పాఠశాల వచ్చినా ఆటో ఆపకపోవడం వల్ల దూకారా? అనే అంశాల్లో క్లారిటీ రావలసి ఉంది. అంతేకాక ఒక విద్యార్థినీ కింద పడిపోయిన వెంటనే ఆటో ఆపితే ప్రాణం పోయేది కాదని, ఆ సమయంలో ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కన్నీరుమన్నీరైన కుటుంబం

మృతి చెందిన విద్యార్థిని సంగీత స్వస్థలం మద్నూర్ మండలం కొడిచెర్ల గ్రామం చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఆశించిన కూతురు, పండుగ పూట శవమై ఇంటికి వస్తుండటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగీత మృతిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు తల్లిదండ్రులు  బైఠాయించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై, ఆటో డ్రైవర్ అజాగ్రత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read :  భట్టి విక్రమార్క సంచలనం.. హరీశ్ రావు అడిగితే చాలు చేయిస్తా!

ప్రిన్సిపల్ సస్పెండ్

కాగా విద్యార్థిని మృతిపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆమె మరణానికి కారణమైన ప్రిన్సిపల్ సునీతపై సస్పెన్సన్ వేటు వేసింది.అలాగే ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా సంగీత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమాచారం అందించారు.  

Advertisment
తాజా కథనాలు