• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

People's Pulse : బీజేపీ ఖాతాలోకి కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లు..పీపుల్స్‌పల్స్‌ సంచలన ఎగ్జిట్‌ పోల్‌

మున్సిపల్ ఎన్నికల పలితాలపై పీపుల్స్‌ పల్స్‌ సంచలన ఎగ్జిట్‌ పోల్స్‌ను వెలువరించింది. రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లకు గాను కరీంనగర్‌, నిజామాబాద్‌ లలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి మేయర్‌ స్థానాలను దక్కించుకుంటుందని ఎగ్జిట్‌ పోల్‌ తేల్చి చెప్పింది.

author-image
By Madhukar Vydhyula 11 Feb 2026 in తెలంగాణ నిజామాబాద్
New Update
FotoJet (12)

Municipal Corporations

Follow Us

People's Pulse : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే పీపుల్స్‌ పల్స్‌ సంచలన ఎగ్జిట్‌ పోల్స్‌ను వెలువరించింది. రాష్ట్రంలోని 7 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి మేయర్‌ స్థానాలను చెజిక్కించుకుంటుందని ఎగ్జిట్‌ పోల్‌ తేల్చి చెప్పింది.

HA4Fc27WUAAxcuG

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉండగా వాటిలో 24- నుంచి 29 స్థానాలు బీజేపీకి దక్కుతాయని ఎగ్జిట్‌ పోల్‌ వివరించింది. ఇక అధికార కాంగ్రెస్‌ పార్టీకి 14 నుంచ 16, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు 10 నుంచి 12, ఎంఐఎంకు 6 నుంచి 9 స్థానాలు, ఇతరులు 1 నుంచి 3 స్థానాల్లో విజయం సాధిస్తారని తేల్చింది. మొత్తం పోలైన ఓట్లలో బీజేపీకి 40.4 శాతం ఓట్లశాతం రానుండగా, కాంగ్రెస్‌కు 21.4 శాతం, బీఆర్‌ఎస్‌కు 20.2 శాతం ఓటుశాతం రానుంది. దీంతో కరీంనగర్ మేయర్‌ స్థానం బీజేపీకి దక్కనుంది. ఇక్కడ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వ్యక్తిగత ప్రచారానికి ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని తెలుస్తోంది.

ఇక నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా 26 నుంచి 31 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం ద్వారా మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకోనుంది. ఇక కాంగ్రెస్‌కు 10 నుంచి 16 స్థానాలు, బీఆర్‌ఎస్‌ 2 నుంచి 4 స్థానాలు, ఎంఐఎం 8 నుంచి 12 స్థానాలు,ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించనున్నారు. ఇక్కడ బీజేపీ రికార్డు స్థాయిలో సగానికి పైగా అంటే 49.1 శాతం ఓటింగ్‌ శాతాన్ని కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్‌ 28.5 శాతంతో రెండవ స్థానంలో ఉండగా బీఆర్‌ఎస్‌ జిల్లాలో పూర్తిగా సతికిల పడి కేవలం 8.1 శాతానికే పరిమితం కానుంది. అదే సమయంలో ఎంఐఎం 8.7 శాతం ఓటింగ్‌ శాతాన్ని పొందనుండటం గమనార్హం. జిల్లాలో బీజేపీ ఎంపీ అర్వింద్‌ ప్రచార శైలి అందరిని ఆకట్టుకుందనే ప్రచారం సాగుతోంది.

మిగిలిన 5 కార్పొరేషన్లలో ఎవరికెన్నంటే?

రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ 30- నుంచి 40 సీట్లు, బీఆర్‌ఎస్‌కు 16 నుంచి 20 సీట్లు, బీజేపీకి 3 నుంచి 6 సీట్లు దక్కనున్నాయి. మంచిర్యాలలో కాంగ్రెస్‌కు 39 నుంచి 43 స్థానాలు, బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 12, బీజేపీకి 6 నుంచి 9 దక్కనుండగా, కొత్తగూడెంలో 28 నుంచి 34 స్థానాలు కాంగ్రెస్‌కు, 7 నుంచి 9 బీఆర్‌ఎస్‌కు దక్కనున్నాయి. నల్గొండలో 21 నుంచి 26 స్థానాల్లో కాంగ్రెస్‌,  8 నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, 6 నుంచి 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధించనుంది. మహబూబ్‌నగర్‌లో 26 నుంచి 30 స్థానాల్లో కాంగ్రెస్‌, 18 నుంచి 22 స్థానాలు బీఆర్‌ఎస్‌, 6 నుంచి 8 స్థానాలు బీజేపీకి దక్కనున్నాయి.

పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌పోల్‌ ప్రకారం మొత్తం 7 కార్పొరేషన్లలో అధికార పార్టీకి 5 కార్పొరేషన్లు దక్కనుండగా, బీజేపీ 7  స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. కాగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ఒక కార్పొరేషన్‌ కూడా దక్కే అవకాశం లేదని ఎగ్జిట్‌ పోల్‌ తేల్చి చెప్పింది.

#muncipal corporation #Muncipal Election #Karimnagar Muncipal Election #BJP Won Muncipal Election #bjp vs congress in nizamabad
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
    తదుపరి కథనాన్ని చదవండి
    newsletter_logo
    మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

    RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


    https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

    https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


    Quick Links

    • About Us
    • Disclaimer
    • Contact Us
    • Feedback & Grievance
    • Advertise With Us
    • Privacy Policy


    Copyright © 2024 · Rayudu Vision Media Limited

    Powered by