ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. శిరీషను అభినందించిన సీఎం రేవంత్!
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఏడాది కాలంలోనే అయిదు ఉద్యోగాలను సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను సీఎం రేవంత్ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు.