TG News: బీఆర్ఎస్ కీలక నేత ఇంట్లో విషాదం.. కేసీఆర్, కేటీఆర్, కవిత సంతాపం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ విప్ కాంతారావు తల్లి రేగా నర్సమ్మ (85) ఈ రోజు ఉదయం మృతి చెందారు. నర్సమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

New Update
KCR

TG News:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ విప్ కాంతారావు తల్లి రేగా నర్సమ్మ (85) ఈ రోజు ఉదయం మృతి చెందారు. వారి స్వగ్రామం కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధాతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇతర కీలక నేతలు సైతం నర్సమ్మ మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటనలు విడుదల చేశారు. 

Also Read:Phone Shaped Slab: ఇది పట్టుకుంటే ఫోన్ కి దూరమైనట్లే!.. కొత్త డిజిటల్ డీటాక్స్ టూల్

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు