/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
ఖమ్మం - వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మరిపెడ శివారు కుడియాతండా వద్ద రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. చికిత్స కోసం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ప్రమాదం గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు
ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన..
ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మైనర్లు సహా ఐదుగురు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వస్తున్న ట్రక్కు బైక్‌ను ఢీకొట్టడంతో నలుగురు మైనర్లు సహా ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి హాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బులంద్‌షహర్ రోడ్డులోని మినీలాండ్ స్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?
అందుతున్న సమాచారం ప్రకారం.. రఫిక్ నగర్ నివాసి అయిన డానిష్ (40) హాపూర్ ప్రాంతంలోని తన స్నేహితుడి ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ నుండి తిరిగి వస్తున్నాడు. అతడు తన ఇద్దరు పిల్లలతో పాటు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల తన సోదరుడి పిల్లలతో బైక్‌పై వస్తుండగా.. వేగంగా వస్తున్న ట్రక్కు వారి బైక్‌ను ఢీకొట్టింది.
ఇది కూడా చూడండి: Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు
దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ జరిగిన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు పంపారు. అదే సమయంలో ఢీకొన్న ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: Nayanthara-Vignesh: జానీ మాస్టర్ ఎఫెక్ట్.. నయనతార, విఘ్నేష్‌పై దుమ్మెత్తి పోస్తోన్న నెటిజన్లు!