Sanju Samson: రాహుల్ ద్రవిడ్ - సంజు శాంసన్ మధ్య గొడవ.. వీడియో వైరల్

రాజస్తాన్ రాయల్స్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ సంజు శాంసన్ మద్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీతో సూపర్ ఓవర్ మ్యాచ్‌ సమయంలో కోచ్ టీమ్ మీటింగ్ పెట్టగా సంజు వెళ్లలేదు. ఆ మ్యాచ్‌లో సంజును ఓపెనింగ్‌కి పంపించకపోవడమే కారణమని తెలుస్తోంది.

New Update
Sanju Samson ignores Rahul Dravid team meeting in dc vs rr super over match

Sanju Samson ignores Rahul Dravid team meeting in dc vs rr super over match

రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొన్ని విభేదాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఓ విషయంలో ఆ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అండ్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్‌ల మధ్య గొడవలు తలెత్తినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి మధ్య గొడవకు అసలు కారణం.. ఇటీవల మ్యాచ్‌లో వచ్చిన సూపర్ ఓవర్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్‌లో తొలి సూపర్ ఓవర్‌ను రాజస్థాన్ జట్టు ఎదుర్కొంది. 

Also Read :  కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ రాగా.. అందులో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది. ఇదే వారిద్దరి మధ్య గొడవకు దారి తీసిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చేయమని తెగ కామెంట్లలో రాసుకొస్తున్నారు. అసలు కోచ్, కెప్టెన్ మధ్య ఏం జరిగింది..?, వారి మధ్య తలెత్తడానికి గల కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ జట్టు తలపడింది. 

Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

రాహుల్, సంజు గొడవకు కారణం ఇదేనా

ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వచ్చింది. అందులో ఓపెనర్స్‌గా హిట్‌మయెర్, రియాన్ పరాగ్ వచ్చారు. సాధారణంగా సంజు శాంసన్‌ ఎప్పుడూ ఓపెనర్‌గా వస్తుండేవాడు.. కానీ అతడికి పక్కటెముకుల నొప్పి కారణంగా దిగలేకపోయాడు. ఢిల్లీ జట్టు బౌలర్ మిచెల్ స్టార్క్ మొదట బౌలింగ్ వేసి తక్కువ పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్ బౌలింగ్‌ చేయగా.. ఢిల్లీ జట్టు ఛేదించి విజయం సాధించింది. 

అయితే ఈ సూపర్ ఓవర్ మ్యాచ్‌కి ముందు రాజస్థాన్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ ప్లేయర్లతో మాట్లాడినట్లు కనిపించాడు. అందరితో మాట్లాడుతున్న సమయంలో సంజు శాంసన్ మాత్రం కాస్త దూరంగా కనిపించాడు. దగ్గరకు రమ్మని సంజును పిలిచినా.. అతడు వెళ్లలేదు. దీంతో అక్కడ నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. 

సంజు శాంసన్‌ను బ్యాటింగ్‌కు వద్దనుకొని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని.. అందుకే అతడు డిస్కషన్‌ వద్దకు వెళ్లలేదని కొందరు చెబుతున్నారు. దీంతో చాలా మంది సంజు శాంసన్‌ను కెప్టెన్సీని వదిలి.. సీఎస్కే జట్టుకు వచ్చేయమని కామెంట్లు చేస్తున్నారు. 

sports-news | rahul-dravid | sanju samson | IPL 2025 | dc-vs-rr

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు