/rtv/media/media_files/2025/04/18/Ql6en4zFt6CDHOd77Ebg.jpg)
KL Rahul and Athiya Shetty reveal name of their daughter
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులు ఇటీవల తల్లిదండ్రులయ్యారు. అతియా శెట్టి మార్చి 24వ తేదీ సోమవారం రోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో వీరికి ఆడబిడ్డ పుట్టడంతో అభిమానులు, సెలబ్రిటిలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
కేఎల్ రాహుల్ కూతురి పేరు
తాజాగా తమ బిడ్డ పేరును కెఎల్ రాహుల్ అండ్ అతియా శెట్టి దంపతులు వెల్లడించారు. ఇవాళ (శుక్రవారం) తమ కూతురి పేరును సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కూతురి ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర నోట్ రాశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ కూతురి పేరు ‘ఎవారా’ అని తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ పోస్ట్‌ను పంచుకున్నారు. పోస్ట్‌లో క్రికెటర్ కెఎల్ రాహుల్ తమ కూతురు ఎవారాను దగ్గరగా పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఆ పక్కనే అతియా తన బిడ్డను చూస్తున్నట్లు ఉంది. తమ బిడ్డ పేరును రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో శుభాంకాక్షలు వెల్లువెత్తాయి.
Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
2023లో వివాహ బంధం
కాగా ప్రేమికులైన ఈ జంట 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 8, 2024న తాను గర్భం దాల్చినట్లు అతియా శెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక క్రికెట్ విషయానికొస్తే కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్నాడు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున ఆడిన రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక అతియా శెట్టి చివరిసారిగా 2024లో సోనాల్ దబ్రాల్ దర్శకత్వం వహించిన గో నోని గో చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో పిఆర్ బాలన్, డింపుల్ కపాడియా, మానవ్ కౌల్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
kl-rahul | kl-rahul-athiya-shetty | KL Rahul daughter name