బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఇంటికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు సతీసమేతంగా వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు రెండు గంటల పాటు హరీష్ రావు నివాసంలో కేటీఆర్ ఉండడం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే.. హరీష్ రావు తండ్రి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO
Also Read : Viral News: ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ
హరీష్ పార్టీ వీడతారంటూ ప్రచారం..
హరీష్ రావు గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ వీడుతారంటూ కూడా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. సొంత పార్టీ పెడతారంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తాను బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని ఇటీవల హరీష్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ ను నాయకుడిగా ప్రకటిస్తే స్వాగతిస్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడంతో జోరుగా చర్చ సాగుతోంది.
Also Read : Viral News: కరీంనగర్‌లో కలకలం.. పెళ్లికి ముందే కోటి కట్నం.. మరో అమ్మాయితో వరుడు జంప్!
Also Read : IPL 2025 - Delhi Captital: ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 11 కోట్ల ఆటగాడు దూరం.. కట్ చేస్తే రూ.3 కోట్లు!
harish-rao | ktr | brs-party | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | latest telangana news | telangana news live updates | telangana-politics | telugu-political-news