/rtv/media/media_files/2025/05/16/cfpJUmPVo5ZqTK99jfDG.jpg)
Mitchell Starc dropped from Delhi Capitals in ipl 2025
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ను నిలిపివేశారు. అనంతరం బీసీసీఐ వారం రోజుల పాటు ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మళ్లీ ఐపీఎల్‌ను రీస్టార్ట్ చేశారు. మే 17వ తేదీ నుంచి పునః ప్రారంభం కానుంది. మొత్తం ఆరు ప్రాంతాల్లో మిగిలిన మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు.
Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!
అయితే ఇక్కడ పలు ఫ్రాంచైజీలకు కొన్ని చిక్కులు తలెత్తాయి. భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణంతో పలు టీమ్‌లకు చెందిన విదేశీ ఆటగాల్లు తమ దేశానికి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి ఐపీఎల్ ప్రారంభం అవుతున్నా ఇక్కడికి వచ్చేందుకు కొందరు ప్లేయర్లు నిరాకరిస్తున్నారు. కొందరేమో అంతర్జాతీయ ట్రోర్నీ కోసం అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పటికి పలు జట్లకు చెందిన ఆటగాళ్లు తిరిగి ఐపీఎల్‌లోకి రావడం లేదని తెలిసింది.
Also Read: BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్
అందులో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన స్టార్ పేసర్ ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. మిచెల్ స్టార్క్. అవును మీరు విన్నది నిజమే. ఈ వార్త ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు.. అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇటీవల తమ దేశానికి వెళ్లిపోయిన మిచెల్ స్టార్క్.. ఇప్పుడు తిరిగి రావడం లేదని తానే తెలిపాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి చెప్పాడు. తాను ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం లేదని స్వయంగా యాజమాన్యానికి తెలిపాడు.
Also Read: Andhra King Taluka: అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. రామ్ కొత్త మూవీ టైటిల్ ఇదే
అదే సమయంలో ఫ్రాంచైజీ కూడా స్టార్క్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా ఢిల్లీ జట్టుకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ జట్టు జేక్ ప్రేజర్ ప్లేస్‌లో ముస్తఫిజుర్ రెహమాన్‌ను చేర్చుకుంది. ఇప్పుడు జట్టులో బలమైన పేసర్ స్టార్క్ కూడా దూరం కావడంతో ఢిల్లీ జట్టుకు బిగ్ షాక్ అనే చెప్పాలి.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
రూ.3.5 కోట్లు ఫైన్
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. మిచెల్ స్టార్క్ మిగిలిన మ్యాచ్‌లకు రాకపోవడంతో $400,000 అంటే సుమారు రూ.3.5 కోట్లు త్యాగం చేసినట్లు తెలుస్తోంది. అంటే అతడు ఐపీఎల్ వేలంలో తీసుకున్న మొత్తంలో రూ.3.5 కోట్లు తగ్గిస్తారు. ఐపీఎల్‌లోని నియమం ప్రకారం.. ఒక ప్లేయర్ సీజన్‌లోని మ్యాచ్‌లన్నీ ఆడకపోతే.. ఆ టీమ్‌కు ప్లేయర్ల జీతం తగ్గించే అధికారం ఉంటుంది. దాని ప్రకారమే ఇప్పుడు మిచెల్ స్టార్క్ జీతం నుంచి తగ్గించనున్నారు. అతడిని ఈ సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అందులో రూ.3.5 కోట్లు తగ్గించనున్నారు.
IPL 2025 | dc | delhi capitals 2025 squad | latest-telugu-news | telugu-news | sports-news