'Indian Armed Forces: దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO

మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీష్‌ దేవ్‌డా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

New Update
Madhya Pradesh Deputy CM Jagdish Devda

Madhya Pradesh Deputy CM Jagdish Devda

పాకిస్థాన్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీష్‌ దేవ్‌డా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. భారత సైన్యంతో కూడా బీజేపీ రాజకీయాలకు దిగజారిందని విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Also Read: ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం జబల్పూర్‌లో జరిగిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం జగదీష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిపై మోదీ స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ''ప్రధాని మోదీకి మనమందరం కృతజ్ఞతలు చెప్పాలి. మొత్తం దేశంతో పాటు మన సైన్యం ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. మోదీ ఇచ్చిన సమాధానాన్ని ఎంత ప్రశంసించినా కూడా సరిపోదని'' అన్నారు.   

Also Read: ఇజ్జత్ పోయిందిపో... సొంత దేశంలోనే పాకిస్తాన్‌కు ఘోర అవమానం

'Indian Armed Forces Bow Down To PM Modi's Feet'

ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో డిప్యూటీ సీఎం జగదీశ్‌పై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నాయకులు దేశ సైన్యంతో కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది. సైనికుల త్యాగాలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే జగదీశ్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read :  సీఎం రేవంత్, భట్టికి మధ్య విభేదాలు.. ఇదిగో ప్రూఫ్.. ఏలేటి సంచలనం!

Also Read :  హరీష్ ఇంటికి కేటీఆర్.. 2 గంటలకు పైగా చర్చలు.. కారణం అదేనా?

telugu-news | rtv-news | operation Sindoor 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు