/rtv/media/media_files/2025/05/16/xFACyv4Igf7rAKNio5iL.jpg)
karimnagar Groom who cheated bride
Viral News: కరీంనగర్‌లో దారుణం జరిగింది. మరో కొన్ని రోజుల్లో పెళ్లి పీఠలెక్కాల్సిన వరుడు వధువు కుటుంబానికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇరు కుటుంబాలను నమ్మించి ఘనంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్న యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే నిశ్చితార్థంలో కట్నంగా ఇచ్చిన నగదు, బంగారంతో లేచిపోయిన ఘటన కరీంనగర్ లో కలకలం రేపగా ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : పాకిస్తాన్ నుండి విడిపోవడం అంత ఈజీ కాదు.. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలంటే ఏం చేయాలి?
కోటి రూపాయల కట్నం..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రంగాపూర్‌కు చెందిన మధుకర్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలోనే నిచ్చితార్థం కూడా గ్రాండ్ గా చేసుకోగా మే 17న పెళ్లి ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బీజీ ఉండగా మధుకర్ ఊహించని షాక్ ఇచ్చాడు. మరో అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకుని పారిపోయాడు. విషయం తెలిసిన ఇరువురి పేరెంట్స్ తీవ్రంగా ఆందోళన చెందారు. ముఖ్యంగా అమ్మాయి కుటుంబం కట్నంగా ఇచ్చిన రూ.40 లక్షల విలువైన అర ఎకరం భూమి,10 తులాల బంగారం, 6 లక్షల నగదు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అబ్బయి తండ్రి కూడా తన కొడుకునే సపోర్టు ఇవ్వడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి పరారిలోవున్న మధుకర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!
ఇదిలా ఉంటే.. ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయమై ప్రేమ పేరుతో వంచనకు గురైన ఒక మైనర్ బాలికి చివరికి సూసైడ్ చేసుకునేందుకు కూడా వెనుకాడలేదు. ఘట్ కేసర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్‌కు చెందిన ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసాడు ఓ యువకుడు.. ఆ తర్వాత ఆమెను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి భారీగా బంగారం తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ మైనర్ బాలిక చెల్లిని కూడా తన వద్దకు పంపాలని ఒత్తిడి చేయడంతో ఆ మైనర్ బాలిక బలవన్మరణానికి ప్రయత్నించింది. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘట్ కేసరకు చెందిన బాలికకు అదే ప్రాంతానికి చెందిన అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయమయ్యాడు. అ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా అప్పుడప్పుడు వారిద్దరూ కలుసుకునేవారు. అలా కలుసుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత యువకుడు వికృత చేష్టలు మొదలు పెట్టాడు.
Also Read: ఇంతకీ 'NTR' ఎవరు..? నాల్గవ తరం వారసుడు పై నెటిజన్ల కామెంట్స్ హల్‌చల్!
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
karimnagar | marriage | Dowry Case | telugu-news | today telugu news