/rtv/media/media_files/2025/05/16/vSpddEC3olQ7lw2QBnAK.jpg)
Rajasthan man halts mother cremation, creates ruckus over jewellery
రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి-బెహ్రూర్ జిల్లాలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఒక కుమారుడు తన తల్లి అంత్యక్రియల సమయంలో గోల గోల చేశాడు. ఆమె వెండి గాజుల్లో వాటా ఇచ్చే వరకు రచ్చ చేశాడు. దీంతో చుట్టూ ఉండే స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన మే 3న విరాట్ నగర్ ప్రాంతంలోని లీలా కా బాస్ గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
తల్లి అంత్యక్రియల్లో కొడుకు గోల
భూరి దేవి (80) అనే వృద్ధురాలికి ఏడుగురు కుమారులు. వీరిది విరాట్ నగర్ ప్రాంతంలోని లీలా కా బాస్ గ్రామం. తాజాగా ఆమె అనారోగ్య కారణాలతో మరణించింది. దీంతో ఆమె అంత్యక్రియలకు కుమారులు, గ్రామస్థులు అంతా సిద్ధం చేశారు. అనంతరం ఆమెకి నివాళులు అర్పించడానికి స్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటల పాటు గందరగోళం ఏర్పడింది.
తల్లి ఆభరణాల్లో వాటా కావాలని అంత్యక్రయలు ఆపిన చిన్న కొడుకు
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2025
లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చి వేయండి అంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించిన చిన్నకొడుకు
జైపూర్ - విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ (80) అనారోగ్యంతో మృతి
ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు చూసుకున్న పెద్ద కొడుకు… pic.twitter.com/6xrlPkl1R2
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
ఏడుగురి కుమారులలో ఐదవ వాడైన ఓం ప్రకాష్ స్మశాన వాటిక వద్ద గోల గోల చేశాడు. తన తల్లి మృతదేహాన్ని చితిపై పెట్టేముందు అతడే అకస్మాత్తుగా దానిపైకి ఎక్కి పడుకున్నాడు. అనంతరం ‘‘ముందు నాకు అమ్మ వెండి గాజుల్లో వాటా ఇవ్వండి. ఆ తర్వాతే చితిపై నుంచి లేస్తాను’’ అని ఓం ప్రకాష్ అరిచాడు. దీంతో చుట్టూ ఉన్నవారు ఖంగుతిన్నారు.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
అతడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా.. ఓం ప్రకాష్ అస్సలు ఆగలేదు. ఇలా రెండు గంటల పాటు గందరగోళం సృష్టించిన తర్వాత.. ఇంటి నుంచి వెండి గాజులను తీసుకొచ్చి అతడికి అందించారు. అవి తీసుకున్న తర్వాత అతడు చితిపై నుంచి పైకి లేచాడు. అనంతరం తన తల్లి దహన సంస్కారాలను కొనసాగించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
అందిన సమాచారం ప్రకారం.. భూరి దేవి మరణం తర్వాత ఆమె వెండి గాజులను కుటుంబ పెద్దలు.. పెద్ద కుమారుడు గిర్ధారికి అప్పగించారు. తన తల్లి ఆభరణాలను పెద్ద కొడుకు తీసుకున్నాడన్న విషయం తెలిసి ఓం ప్రకాష్ అంత్యక్రియలను రెండు గంటలపాటు ఆపి రచ్చ రచ్చ చేశాడు. కాగా చాలా కాలంగా వీరిద్దరికీ ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిసింది. ఈ విభేదాల కారణంగా ఓం ప్రకాష్ తన సోదరుల నుండి విడిగా నివసిస్తున్నాడు.
crime news | viral-news | Viral Video | latest-telugu-news | telugu-news