Heavy Rains: నాలుగు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది.