Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ  రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ విధించింది.

New Update
telangana weather report

Weather Update

తెలంగాణ(telangana) లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(imd) తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ విధించింది. నేటి నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాలలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Telangana Rains : హైదరాబాద్‌‌లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడు రోజులు వానలే

ఇది కూడా చూడండి: HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్‌, ఉస్మాన్ సాగర్!

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

అలాగే ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మెదక్ జిల్లాలో 29వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మూడు రోజుల పాటు ఒకటే వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్లు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు