Lovers Suicide : నిర్మల్‌ జిల్లాలో దారుణం..మనస్పర్థలతో ప్రేమికుల ఆత్మహత్య

నిర్మల్‌జిల్లా లోకేశ్వరం మండలం వాటోలి గ్రామంలో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో ఆదివారం అఖిల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు చనిపోవడంతో కలత చెందిన నరేష్‌ సోమవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
FotoJet - 2025-11-04T082424.385

Lovers commit suicide due to emotional conflicts

నిర్మల్‌ జిల్లా(nirmal-district) లోకేశ్వరం మండలం వాటోలి గ్రామంలో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య(lovers-suicide) చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం..వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్‌(22), అదే గ్రామానికి చెందిన భూంపల్లి అఖిల(21)లు మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అఖిల ఇంటర్మీడియెట్‌ పూర్తికాగా.. నరేశ్‌ డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో ఆదివారం అఖిల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు చనిపోవడంతో కలత చెందిన నరేష్‌ సోమవారం గోదావరిలో దూకాడు. స్థానికులు మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నరేశ్‌ తల్లి ముత్తవ్వ ఫిర్యాదు మేరకు లోకేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లోకేశ్వరం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.

Also Read :  వెంటాడిన మృత్యువు.. ట్రైన్ మిస్ కావడంతో బస్ ఎక్కి.. ముగ్గురు అక్కాచెళ్లెళ్ల కన్నీటి కథ!

Lovers Commit Suicide Due To Emotional Conflicts

ప్రేమ జంట మృతితో వట్టోలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన బిడ్డలు చనిపోయాడని వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.  ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రియురాలు అఖిల మృతి చెందిన వెంటనే నరేష్ గోదావరిలో శవమై తేలడం అనుమానాలకు తావిస్తోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read :  టీమిండియా జట్టులో నో ప్లేస్.. కానీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంట్రీ.. కట్ చేస్తే మ్యాచ్ ఆఫ్ ది ప్లేయర్

Advertisment
తాజా కథనాలు