Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

New Update
rains

rains

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం అల్పపీడనం శ్రీలంక తీరం దగ్గర నెమ్మదిగా బలపడుతోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో మధ్యస్థాయి వర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి అసలు వెళ్లకూడదని తెలిపారు. భారీ గాలులు వీచడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

ఇది కూడా చూడండి: TG Crime : గుండె పగిలే విషాదం..  నువ్వు లేని జీవితం నాకొద్దంటూ.. !

ఈ జిల్లాల్లో చలి తీవ్రత..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇంతటి చలిలో మళ్లీ వర్షాలు కురిస్తే ఇంకా చలి తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఆదిలాబాద్‌లో చలి తీవ్రత అధికంగా ఉందని వెల్లడించారు. పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉదయం పూట బయటకు రావాలని అధికారులు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ బిగ్ అప్‌డేట్.. మాస్ సాంగ్ లోడింగ్..!

Advertisment
తాజా కథనాలు