R.S. PRAVEEN KUMAR: సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అదే నియోజకవర్గం నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్‌పీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్‌ఎస్పీ బీఆర్‌ఎస్‌లో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని కోనప్ప కాంగ్రెస్ కండువా కప్పు కున్నారు. ఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన కొనప్ప అక్కడ ఇమడలేకపోవడంతో తిరిగి ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ క్రమంలో సిర్పూర్ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చ సాగుతున్న సమయంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ సిర్పూర్ నుండే బరిలోకి దిగుతానంటూ ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొని బిగ్‌ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు కోనేరు కోనప్ప తిరిగి పార్టీలోకి వస్తానంటే తాను వ్యతిరేకించలేదని అన్నారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారని పార్టీ అవసరాలను బట్టి అది జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యం అని తేల్చి చెప్పారు.
అంతేకాదు కోనప్ప విషయంలో పార్టీ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. కానీ తనను సిర్పూర్ ప్రజలు తమ ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లాననన్నారు. కోనప్ప తన సీటు ఆశీస్తాడని అనుకోవడం లేదని,ఆయనకు అక్కడ అనుచరులు ఉంటే తనను 45వేల మంది అభిమానించారని చెప్పారు. సిర్పూర్ నుండి పోటీ చేయాలనే తన మనసు చెబుతోందని, సిర్పూర్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు.
అలాగే సిర్పూర్ నుంచి పోటీ చేసే విషయంలో తాను పార్టీని ఒప్పి్స్తాననే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామన్నారు. బీఆర్ఎస్‌లో తాను అసంతృప్తిగా ఉన్నాననే మాట అవాస్తమని , పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. కాగా కోనప్ప, ఆర్‌ఎస్ ప్రవీణ్ తాజా వివాదం నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుంది అనేదానిపై చర్చ మొదలైంది.
Also Read: Vikarabad Murder: వికారాబాద్ లో దారుణం..కుటుంబాన్ని కడతేర్చిన కసాయి..ఆ తర్వాత ఏం చేశాడంటే
R.S. PRAVEEN KUMAR: బిగ్ ట్విస్ట్..మళ్లీ సిర్పూర్ నుండే పోటీ చేస్తా.. ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయాలనుకుంటున్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ సిర్పూర్ నుండే బరిలోకి దిగుతానంటూ ఆర్ఎస్పీ చెప్పటం ఆసక్తిగా మారింది.
R.S. PRAVEEN KUMAR vs koneru konappa