/rtv/media/media_files/2025/09/20/husband-kills-wife-2025-09-20-12-27-39.jpg)
Husband kills wife
Crime News : భార్యభర్తల మధ్య తలెత్తే వివాదాలతో ఒకరినొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో అక్క ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఊహించని ఘటనతో కుటుంబం ఉలిక్కిపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. యాదాద్రి జిల్లా అడ్డగూడూర్‌కు చెందిన బోడ శంకర్(40), మంజుల(35) దంపతులు బాంబే నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు గుర్తించారు. మంజులపై అనుమానంతో నే శంకర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.-- మొన్న కుటుంబంతో శంకర్ దంపతులు మహేశ్‌నగర్‌లోని సోదరి ఇంటికొచ్చినట్లు తెలిసింది.-- నిన్న రాత్రి నిద్రిస్తున్న భార్యను శంకర్ కత్తితో నరికి చంపడం కలకలం రేపింది. హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Skin Health: అరేబియన్ భామల అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?
కాగా బోడ శంకర్(40), మంజుల(35) దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక పాప ఇద్దరు బాబులు. వీరి స్వస్థలం మోత్కూర్ దగ్గర అడ్డగూడూర్ గ్రామం. శంకర్ నాలుగు రోజుల క్రితం మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న సోదరి ఇంటికి కుటుంబంతో కలిసి వచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి అందరు నిద్రపోయిన సమయంలో కత్తితో విచక్షణారహితంగా భార్యను నరికాడు. ఆమె అరుపుల శబ్దానికి అందరూ లేవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. మంజుల అప్పటికే మృతి చెందింది.నిందితునికోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Beauty Movie: ''OG''కి ఎదురెళ్తున్న.. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న: హీరో అంకిత్ కొయ్య
మరోవైపు కొమురం భీం జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్ లో భార్యను భర్త గజ్జల తిరుపతి హత్య చేశాడు. భార్య స్రవంతి (40) ని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు భర్త. హత్య విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?