Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

New Update
Rains

Rains

Weather Update: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఈ సమయంలో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి.. ఈ జిల్లాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఏపీలో వైజాగ్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురుస్తాయని వెల్లడించారు. వర్షాలు, చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

Also Read: మొత్తం విప్పేసి.. డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ హాట్ షో అందాలు.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

ఇది కూడా చూడండి: తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

ఇదిలా ఉండగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి. ఏపీలో వనజంగి, అరకు లోయ, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. తెలంగాణలో ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారు జామున చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చల్ల గాలి తగలకుండా చేతికి గ్లౌస్, స్వెటర్లు వంటివి ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు