/rtv/media/media_files/2025/09/14/new-trend-guru-2025-09-14-11-39-03.jpg)
New trend guru...if glasses are for women...then beer is for men
Men festivals With Bottles : ఒకపుడు వదిన మరదళ్ల గాజులు, మనవరాలు అమ్మమ్మ గాజులు, అన్నచెల్లెళ్ల కుడుకలు ఇలా కొత్త కొత్త ఆచారాలు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేక మైన మాసల్లో ప్రత్యేక పూజలు చేయడం ఆనావాయితీ. చాలామంది మహిళలు శ్రావణమాసంలో వ్రతాలు చేసుకుని వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. అయితే వీటిలో మగవారికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. వారి పని.. పూజల పేరుతో అయ్యే ఖర్చులు పెట్టుకోవడం.. ఆడవారు పూజలు చేస్తుంటే చూస్తూ ఉండటమే.అయితే ఆడవారికే సంప్రదాయలు ఎందుకు అనుకున్నారేమో కానీ..నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలోని పురుషులు తాము కూడా పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అసలు దేవుళ్లకు తమ ఇంటి మహిళలు పూజలు చేస్తున్నారు కాబట్టి.. తాము తమ ఆనందం కోసం పూజలు చేయాలనుకున్నారు. అందుకే వెరైటీగా.. ఆలోచించారు. చివరికి ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇప్పుడీ ట్రెండ్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోంది.
Also Read: చీరకొంగునే ఆయుధంగా మలిచి...నక్కతో 65 ఏళ్ల వృద్దురాలు బిగ్ ఫైట్
ఆడవారికే మగవారికి అందులోనూ స్నేహితులకు కూడా అలాంటిదే ఓ కొత్త ఆచారం నిర్మల్ జిల్లాలో మొదలైంది. మహిళలు గాజులు మార్చుకుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అని పురుషులు ఏకంగా బీర్లు, క్వార్టర్ లు ఇచ్చిపుచ్చికుంటున్నారు. వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం అనే సంప్రదాయాన్ని తమదైన పద్దతికి అన్వయిస్తే ఎలా ఉంటుందా అని బాగా ఆలోచించి ఈ కొత్త పద్దతిని తీసుకు వచ్చేశారు. దాని ప్రకారం ఓ మంచి ముహుర్తం పెట్టేసుకుని రంగంలోకి దిగిపోయారు. ఫలానా రోజు..ఫలానా చోట.. వాయినాలు ఇచ్చి పుచ్చుకుందామని మాట్లాడుకున్నారు. అ ప్రకారం ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్నట్లుగానే అంతా ఆ సమయానికి అక్కడికి వెళ్లారు. చక్కగా చాపలు పర్చుకున్నారు. సెటప్ అంతా రెడీ చేసుకున్నారు. ఎవరు ఎవరికి ఎలాంటి వాయినాలు ఇవ్వాలో కూడా రెడీ చేసుకున్నారు. బొట్లు పెట్టడం.. కండువాలు కప్పడం వంటి సంప్రదాయాలను కూడా మర్చిపోలేదు. అన్ని ఏర్పాట్లు చేసుకుని వాయినాల కార్యక్రమం ప్రారంభించారు. ఇంతకూ వారిచ్చుకుంటున్న వాయినాల్లో ఏముంటాయంటే.. మద్యం బాటిల్స్. స్నేహితులను పిలుచుకొని ఒకరికొకరు బొట్లు పెట్టుకొని, కండువాలు సమర్పించుకొని, మందు బాటిల్లతో వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇలా “మగవారి వాయినాలు” ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
Also Read: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
అంతే కాకుండా బొట్టు పెట్టుకుని టవల్ కప్పుకుని సన్మానాలు సైతం చేసుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం సిద్ధుల కుంట, లక్ష్మణ చాంద మండలం కనకాపూర్ గ్రామాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అటు వైన్ షాపుల్లో మందుకు, ఇటు గాజుల షాపుల్లో గాజులకు ఫుల్‌గా గిరాకీ అవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ గ్రామంలో యువకులు మగవాళ్ళఇలా వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు రావడంతో వైరల్ గా మారాయి. ఏదేమైనా మగవారి వాయనాలు పలువురికి నవ్వులు తెప్పిస్తున్నాయి.
Also Read: వాటే థాట్.. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే.. ఒంటెలపై మద్యం అక్రమ రవాణా