/rtv/media/media_files/2025/10/05/tragedy-in-nirmal-district-2025-10-05-15-27-15.jpg)
Tragedy in Nirmal District
Sad News: మారుతున్న జీవనశైలితో ఏ వయసులో ఎలాంటి అనారోగ్య సమస్య వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వయసుతో పనిలేకుండా పసివారి నుంచి పండు ముసలి వరకు ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తి అర్థాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇటీవల కొత్తగా పెళ్లైన నవవధువు బతుకమ్మ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. అత్తగారింట్లో కొత్తగా అడుగుపెట్టిన నవవధువు తొలి బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోటి కలలు కంది. అనుకున్నట్లుగానే ఆడపడుచులు, తోటి కోడళ్లు, కొత్తగా పరిచయమైన అత్తగారి ఊరి స్నేహితులతో కలిసి బతుకమ్మ ఆడింది. ఆనందగా పాడింది.కానీ ఆ ఆనందం ఎంతో సమయం మిగలలేదు.అంతలోనే ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తలనొప్పిగా ఉందని, గుండెల్లో బరువుగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఇది కూడా చదవండి: విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా
నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన రిషితకు బైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామానికి చెందిన వాటోలి రాజు అనే యువకుడితో ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో ఆనందంగా గడుపుతున్న రిషితకు ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా తొలి బతుకమ్మ అయింది. ఈ క్రమంలో బతుకమ్మను అత్తారింట్లోనే జరుపుకోవాలని భావించింది రిషిత. అందులో భాగంగానే అందరిలాగే వానల్ పాడ్ గ్రామంలో అత్తాగారింటి వద్ద ఆనందంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. దాదాపు గంటపాటు బతుకమ్మ పండుగలో సంబురంగా ఆడిపాడిన రుషిత ఒక్కసారిగా తనకు తీవ్రమైన తలనొప్పి వస్తుందంటూ ఇంటికి వెళ్తానంటూ చెప్పింది. ఇంతలోనే గుండెల్లో బరువుగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి ఒక్కసారిగా కుప్పకూలింది.
Also Read : ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం..అనుమానస్పదంగా యువతి మృతి
అందరూ ఒక్కసారిగా ఆందోళన చెందడంతో పాటు అప్రమత్తమైన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులు రిషితను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన రిషిత పరిస్థితి విషమంగా ఉందని బైంసాకు తరలించాలని సూచించాడు. ఆర్ఎంపీ సలహాతో బైంసాకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరింత తీవ్ర అస్వస్థతకు గురైంది. అయినా వారంతా బైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. అప్పటివరకు తమతో ఆడుతూ పాడుతూ గడిపిన రిషిత లేదని తెలిసి స్థానికులతో పాటు అత్తవారి ఇంట.. అటు పుట్టినింట తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.
ప్రాణం తీసిన డీజే సౌండ్
మరోవైపు నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట కాలనీలో బతుకమ్మ ఆడుతున్న 56 ఏళ్ల బిట్లింగు భాగ్యలక్ష్మి, డీజే సౌండ్ మూలంగా గుండెనొప్పి రావడంతో మృతి చెందారు. పండుగల వేళ కర్ణకఠోరంగా మారిన పాటల శబ్దాలు తెలంగాణ వ్యాప్తంగా పలు మరణాలకు కారణమవుతున్నాయని, ఈ ఘటన పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Also Read : Los Angeles: పార్సల్ డెలివరీల్లో కొత్త ట్రెండ్.. నేరుగా ఆకాశం నుంచే అందుకోవచ్చు!