/rtv/media/media_files/2025/10/13/india-to-witness-colder-winter-this-year-2025-10-13-10-31-47.jpg)
winter
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. రోజంతా సాధారణ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి, తెల్లవారు జామున బాగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతంలో తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో కూడా కనిష్టంగా 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చూడండి: Delhi Blast: ఫరీదాబాద్ లో పట్టుబడ్డ మహిళా డాక్టర్ ఎవరు? ఉగ్రవాదంలోకి ఎలా వచ్చింది?
ఏపీలో ఈ జిల్లాల్లో..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఈ ప్రాంతాల్లో ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా రోడ్లపై దృష్టి సారించడం కష్టమవుతోంది. దీనివల్ల వాహనదారులు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో వాహనాలు నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెబుతోంది.
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీలో దారుణంగా ఎయిర్ పొల్యూషన్..అమల్లోకి కఠిన ఆంక్షలు
Follow Us