దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో..
బంగాళాఖాతంలో దానా తుఫాన్ తీవ్రంగా బలపడింది. ఈ రోజు అర్థరాత్రి లేదా రేపు ఉదయానికి పూరి-సాగర్ ఐలాండ్ సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీరం దాటే సమయానికి 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.