BIG BREAKING: కేంద్రమంత్రి అరెస్టు.. !

పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌ అల్లర్ల బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

New Update
Police detain Union minister Sukanta Majumdar

Police detain Union minister Sukanta Majumdar

వక్ఫ్‌ బోర్డుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా.. మరో 280 మందిని అరెస్టు చేశారు. అయితే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్‌ అల్లర్ల కోసం విరాళాలు సేకరించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి సుకాంత మజుందార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మిగతా బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: వక్ఫ్‌ బోర్టుకు వ్యతిరేకంగా అల్లర్లకు వారే కారణం: మమతా బెనర్జీ

కోల్‌కతాలోని సీఎం మమతా బెనర్జీ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సుకాంత ముందార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్‌లో ఎక్కిస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముర్షిదాబాద్‌ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందుకు విరాళాలు సేకరిస్తున్నాం. బాధితుల కోసం విరాళాలు సేకరించడం నేరమా ? మేము నిరసనలు చేయకూడదా ?, ఇది మా ప్రాథమిక హక్కు'' అని సుకాంత ముందార్‌ అన్నారు. 

Also Read: మీరు ఉద్యోగాలకు వెళ్లండి.. నాదీ గ్యారెంటీ : దీదీ

మరోవైపు దీనిపై ఓ సీనియర్ పోలీస్ అధికారి స్పందించారు. '' ఇది చాలా భద్రతపరమైన ప్రాంతం. ఎవరైనా ఇక్కడ ఏదైనా ప్రొగ్రామ్ నిర్వహించాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. బీజేపీ నేతలు విరాళాలు సేకరించే ముందు స్థానిక పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందని'' తెలిపారు. 

Also Read: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు జరిగేది అప్పుడే.. హాజరుకానున్న ట్రంప్

పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్‌(సవరణ) చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ముస్లిం సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో నిరసనలు ఉద్రిక్తమయ్యాయి. అయితే తాజాగా ఈ అల్లర్లపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెస్ట్ బెంగాల్‌ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చిన కొందరు దుండగులు.. యువకులను రెచ్చగెట్టి అల్లర్లకు కారణమయ్యారని అన్నారు. 

telugu-news | national-news | west bengal

Advertisment
Advertisment
తాజా కథనాలు