10th Class Girl : చనిపోయిన 17 రోజులకు రిజల్ట్స్.. కట్ చేస్తే టాపర్ !

పశ్చిమ బెంగాల్‌కు చెందిన థాబి ముఖర్జీ అనే ఓ పదో తరగతి విద్యార్థిని అనారోగ్యంతో బాధపడతూ కన్నుమూసింది. ఆ బాలిక చనిపోయాక 17 రోజులకు వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో స్కూల్ టాపర్ గా నిలిచింది. అంతేకాకుండా జిల్లాలో టాప్ 8 గా నిలిచింది.

New Update
school toper

school toper

పశ్చిమ బెంగాల్‌కు చెందిన థాబి ముఖర్జీ అనే ఓ పదో తరగతి విద్యార్థిని అనారోగ్యంతో బాధపడతూ కన్నుమూసింది. ఆ బాలిక చనిపోయాక 17 రోజులకు వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో స్కూల్ టాపర్ గా నిలిచింది. అంతేకాకుండా జిల్లాలో టాప్ 8 గా నిలిచింది. ఆమె మార్కుల షీటు చూసిన వారందరికీ కన్నీళ్లు వచ్చాయి.  పరీక్షకు కొన్ని రోజుల ముందు థాబీకి కామెర్లు వచ్చాయి. ఆమె ప్రతిరోజూ మందులు వేసుకుని పరీక్షకు వెళ్లేది. పరీక్ష తర్వాత ఆమెకు చికిత్స అందించేవారు.

Also read :  మర్మాంగాలను కొరికి చంపిన కుక్క...అసలు ట్విస్ట్‌ ఏంటంటే?

అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది.   టాపర్స్ జాబితాలో థాబి పేరు చూసి పాఠశాల నుండి ఆమె కుటుంబ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ ఏడ్చేశారు.  థాబి బెంగాలీలో 99, గణితంలో 98, భౌతిక శాస్త్రంలో 97, జీవశాస్త్రంలో 98, చరిత్ర, భూగోళ శాస్త్రంలో 95 మార్కులు సాధించింది.

Also read :  పునాది లేకుండా గోడ.. సింహాచలం ఘటనపై త్రిమెన్ కమిషన్ సంచలన రిపోర్ట్!

చాలా తెలివైనది 

థాబి పాఠశాల ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ  16 ఏళ్ల థాబి చదువులో చాలా తెలివైనదని తెలిపారు.  ఆమె చదువులో చాలా మంచిదని, ఆమెకు నాలుగు స్కాలర్‌షిప్‌లు వచ్చాయన్నారు. ఈరోజు ఆమె ఉంటే చాలా సంతోషంగా ఉండేదని.. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌కు కూడా తీసుకెళ్లారు కానీ డాక్టర్లు కూడా ఆమెను కాపాడలేకపోయారని చెప్పారు.  

Also read : మిస్ వరల్డ్ పోటీలకు కావాల్సిన అర్హతలేంటి? అందం ఉంటే ఒక్కటే ఉంటే సరిపోతుందా?

Also read :  బిగ్‌బాస్ లో వ్యభిచారం.. సీపీఐ నారాయణ సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
తాజా కథనాలు