/rtv/media/media_files/2025/04/26/rmjA8NGfqke7gGEbkNWo.jpg)
west-bengal-teacher
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు. బైసరన్ లోఅమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది స్పాట్ లోనే మరణించారు. ఈ ఘటనలో ఎక్కువ మంది పర్యాటకులు గాయపడ్డారు కూడా. టూరిస్టులను చంపేముందు ఉగ్రవాదులు వారు ఏ మతానికి చెందినవారో కూడా నిర్ధారించుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పెద్ద అడుగు వేశాడు. స్కూల్ టీచర్ అయిన సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇది నా వ్యక్తిగత నిర్ణయం
ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేనని తెలిపారు. మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోందని .. అందుకే ఇస్లాంను త్యజిస్తున్నానని వెల్లడించారు. అయితే తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా వారికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. నేను ఏ మతాన్ని అగౌరవపరచడం లేదని ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని తెలిపాడు. ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్న ప్రపంచంలో తాను జీవించాలనుకోవడం లేదని హుస్సేన్ అన్నారు.