/rtv/media/media_files/2025/05/05/ao3j4mVPdct5AMKxWrEl.jpg)
man bites off and swallows wife nose
సాధారణంగా భార్య అందంగా ఉంటే.. భర్త మురిసిపోతూ ఉంటాడు. ఇలాంటి అందమైన భార్య తనకు దొరకడం తన అదృష్టం అని ఫీలవుతూ ఉంటాడు. ఆమెపై ఎనలేని ప్రేమను చూపిస్తాడు. ఆమెకు ఏది కావాలంటే అది కొనిస్తాడు. బాధపెట్టకుండా తన భార్యను అల్లారు ముద్దుగా చూసుకుంటాడు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
కానీ ఇక్కడో భర్త మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాడు. తన భార్య అందంగా ఉందని దారుణానికి తెగబడ్డాడు. అతడు చేసిన పనికి ఊరు ఊరంతా ఒక్కసారిగా అవాక్కైంది. ఇలా చేశాడేంట్రా బాబు అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. మరికొందరైతే ఛీ ఛీ అంటూ అతడిపై దుమ్మెత్తిపోశారు. ఇంతకీ అతడు ఏం చేశాడు. ప్రజలు అతడిని ఛీదరించుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికొస్తే..
Also Read : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
భార్య ముక్కు అందంగా ఉందని
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా శాంతీపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివాసముంటున్నారు. తన భార్య అందంగా ఉండటంతో బాపన్ షేక్ తరచుగా ఆమె ముఖాన్ని, ముఖ్యంగా ఆమె ముక్కును ప్రశంసించేవాడు. కానీ అదే ఆమెకు శాపంగా మారింది. శుక్రవారం మధు ఖాతూన్ నిద్రపోతున్న సమయంలో బాపన్ అకస్మాత్తుగా ఆమె ముక్కును కొరికి మింగేశాడు.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
దీంతో తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతుల ఇంట్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. మధు ఖాతూన్ అరుపులు, కేకలతో ఆ ఇళ్లు దద్దరిల్లింది. దీంతో ఏమైందా? అని చుట్టూ ఉన్నవారు వెళ్లి చూసేసరికి ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తం కారుతూ కనిపించింది. అనంతరం మధు ఖాతూన్ తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతీపుర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి భర్త బాపన్ షేక్ పై ఫిర్యాదు చేసింది. ఆపై తన భర్త ఎలాంటి వాడో పోలీసులకు తెలిపింది.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
‘‘నా భర్త అప్పుడప్పుడు మద్యం తాగేవాడు. అప్పుడు నా ముఖం, ముక్కును పొగుడేవాడు. నా ముక్కు కొరికి తింటానని చెప్పేవాడు. శుక్రవారం రాత్రి అతను అన్నంతపని చేశాడు. అలాగే నా ముఖం అందంగా ఉండటంతో నాపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు’’ అని మధు ఖాతూన్ ఫిర్యాదులో తెలిపింది.
viral-news | latest-telugu-news | telugu-news | west bengal | west bengal news