BJP MLAs Clash : అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ..వారు లేకపోతే...
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.