/rtv/media/media_files/2026/02/02/yogi-adityanath-2026-02-02-19-44-56.jpg)
Yogi Adityanath Govt Has Withheld Salaries Of Over 68,000 Employees
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను అందించాలని సూచనలు చేశారు. అవినీతి రహిత పాలన దిశగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 8,66,261 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్లలో 68 వేల మంది ఉద్యోగులు వాళ్ల ఆస్తుల వివరాలు ఇవ్వలేదు.
Also Read: యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్..
దీంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆ ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల జనవరి వేతనాలు నిలిపివేస్తూ ఆదేశించారు. ఆస్తుల వివరాలు ఇచ్చేవరకు కూడా ఉద్యోగులకు జీతాలకు ఇవ్వకూడదని సంబంధిత శాఖ అధికారులకు తేల్చిచెప్పారు. వాళ్లపై ప్రమోషన్లు నిలిపివేయడంతో పాటు పెనాల్టీ విధిస్తాంటూ హెచ్చరికలు జారీ చేశారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 25 శాతం తగ్గనున్న పదో తరగతి సిలబస్
Follow Us