/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t130119-2026-01-18-13-02-07.jpg)
UP Road Accident
UP Road Accident : ఉత్తర భారత దేశం(uttarpradesh) లో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. యూపీలోని అమ్రోహా జిల్లా, షావజ్‌పూర్ గ్రామం వద్ద ఢిల్లీ- లఖ్నవూ రహదారిపై భారీ ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నవి కనిపించక వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం(accidents on highways) లో 12 మంది గాయాలపాలయ్యారు. 10 వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
దట్టమైన పొగమంచు ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది. అమ్రోహా జిల్లాలో ని లక్నో-ఢిల్లీ జాతీయ రహదారి (NH-9)పై పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గజ్రౌలా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహ్వాజ్‌పూర్ దోర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో, దాదాపు 10 వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మందికి పైగా గాయపడినట్లు ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కొంత సమయం తర్వాత, పోలీసులు క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. - accident in lucknow
Also Read : మౌనీ అమావాస్య.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
Accident Due To Fog In UP
ఇదిలా ఉంటే, దేశరాజధాని ఢిల్లీలో కూడా నేటి ఉదయం పొగమంచు పరుచుకుంది. పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 430 మార్కును దాటింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. కాలుష్యం కట్టడి కోసం శనివారం నుంచే జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది (Dense Fog). దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది.
ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్‌సర్, ఆగ్రా, గ్వాలియర్, ప్రయాగ్‌రాజ్, జైసల్మేర్ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం పడింది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Also Read : గుడ్ న్యూస్.. ఇక మీదట పీఎఫ్ డబ్బులు నేరుగా అకౌంట్‌లోకి..
Follow Us