/rtv/media/media_files/2026/02/21/avimukteswarananda-swami-2026-02-21-20-31-06.jpg)
Avimukteswarananda Swami
Avimukteshwaranand Saraswati : పిఠాధిపతుల పేరుతో అ సాంఘిక కార్యాకలపాలకు పాల్పడుతున్న స్వామిజీల లిస్టలో మరో స్వామిజీ చేరారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు ఈ రోజు ఆదేశించింది. ఆయనతో పాటు ఆయన శిష్యుడు స్వామి ముక్తానంద్ గిరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ చౌరాసియా ఆదేశాలు జారీ చేయడం సంచలనం సృష్టించింది.
అవిముక్వేశ్వరానంద తో పాటు. శిష్యుడు స్వామి ముక్తానంద్ గిరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి తక్షణం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఝాన్సీ పోలీస్ స్టేషన్‌కు కోర్టు తీర్పు వెలువరించింది. కాగా స్వామి అవిముక్తేశ్వరానంద ఆశ్రమం చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతోందని, శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్, శాకుంభరి పీఠాధీశ్వర్ అశుతోష్ బ్రహ్మచారి మహరాజ్ సీఆర్పీసీ సెక్షన్ 173(4) కింద జనవరి 28న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వారణాసిలో ఉన్న విద్యామఠ్లో గురుసేవ పేరుతో ఆశ్రమ నిర్హహకులు మైనర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బ్రహ్మచారి మహరాజ్ తన పిటిషన్లో ఆరోపించారు. ఈ విషయంలో సుమారు 20 మంది బాధిత పిల్లలు తనను సంప్రదించి ఫిర్యాదు చేశారని పిటిషన్లో తెలిపారు. తన వాదనను బలపరచే ఒక సీడీని కూడా ఆయన పిటిషన్ తో పాటు సమర్పించారు.
ఈ విషయం వెలుగులోకి రాగానే ఫిబ్రవరి 13న కోర్టు ఇద్దరు మైనర్ బాధితుల నుంచి వీడియోగ్రాఫ్డ్ స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసింది. ఈ సాక్ష్యాలతో పాటు పోలీసు రిపోర్ట్‌ను కూడా సమీక్ష చేసింది. అయితే పోలీస్ రిపోర్ట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్ ఆదేశాలపై తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలివ్వటం పట్ల బ్రహ్మచారి మహరాజ్ హర్షం వ్యక్తం చేశారు. 'దైవిక న్యాయం'గా కోర్టు ఆదేశాలను ఆయన అభివర్ణించారు. మరోవైపు, అవిముక్తేశ్వరానంద వర్గాలు ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. స్వామి చేపట్టిన గోసంరక్షణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయనను బదునం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఆపై కట్టుకథలు అల్లుతున్నారని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Follow Us