Korean Love Game: ముగ్గురు అక్కాచెల్లెళ్లను చంపిన కొరియన్ గేమ్ ఏంటి? అది ఎంత డేంజరో తెలుసా?

కొరియన్ లవ్ గేమ్ ఆడి ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొరియన్ లవ్ గేమ్ చాలా డేంజర్ అని నిపుణులు అంటున్నారు. ఓ కల్పిత ప్రపంచంలోకి వెళ్లి అక్కడి టాస్క్‌లను పూర్తి చేయడమేనని చెబుతున్నారు.

New Update
korean love game

korean love game

ఈ మధ్య కాలంలో ఇండియన్స్ ఎక్కువగా కొరియన్స్‌ను ఇష్టపడుతున్నారు. వారిలాంటి స్కిన్ టోన్ ఉండాలని అక్కడి చిట్కాలు పాటించడం, ఫుడ్ విషయంలో కూడా అలాంటి నియమాలు పాటిస్తున్నారు. ఇండియన్స్‌ను కాకుండా కొరియన్స్‌ను పెళ్లి చేసుకోవాలని కూడా కొందరు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ కొరియన్స్ మీద ఉన్న ప్రేమతో ఓ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆడిన కొరియన్ లవ్ గేమ్‌తో వారి ప్రాణాలే పోయాయి. ఈ గేమ్‌కు అలవాటు పడిన వీరు ఆపకుండా ఉండేలేక 9 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్మ  చేసుకున్నారు. ఈ కొరియన్ లవ్ గేమ్‌లో కొన్ని టాస్క్‌లు ఉంటాయి. వీటిని ఛేజ్ చేస్తూ మైనర్లు అయిన ముగ్గురు సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఈ కొరియన్ లవ్ గేమ్ ఏంటి? ఇది ఎంత డేంజరో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: U19 World Cup 2026: ఆఫ్ఘన్‌ను ఊడ్చేసిన భారత కుర్రాళ్లు..  ఫైనల్లో భారత్ vs ఇంగ్లాండ్!

కొరియన్ లవ్ గేమ్ అంటే.. ఆన్‌లైన్‌లో ఆడే ప్లేయర్లు కొన్ని పాత్రలను ఎంచుకుని ఆ టస్క్‌లను పూర్తి చేయాలి. ఇది కేవలం ఆట మాత్రమే కాదు. వారిని మానసికంగా కల్పిత ప్రపంచంలోకి బంధిస్తారు. ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా భారతీయులమనే విషయాన్ని మర్చిపోయి.. కొరియన్ యువరాణులుగా భావించుకున్నారు. అదే సమయంలో గేమ్ ఆడవద్దని తండ్రి తిట్టడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. యువరాణులైన మనం ఎందుకు వీరితో తిట్టించుకోవాలని భావించి చనిపోయినట్లు వారి డైరీలో పోలీసులు గుర్తించారు. అయితే వీరు గత మూడేళ్ల నుంచి ఈ ఆన్‌లైన్ గేమ్‌కు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఇందులోని టాస్క్ పూర్తి చేయాలని ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు పిల్లలు కొరియన్స్ కోసం ఎక్కువగా మాట్లాడుకునేవారని, కొరియా వెళ్లాలని అనుకునేవారని తండ్రి వాపోయారు. ఇలాంటి ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారని అసలు గుర్తించలేదని తండ్రి బాధపడ్డారు. 

ఈ గేమ్ డేంజరా?

ఈ కొరియన్ గేమ్స్ చాలా డేంజర్ అని నిపుణులు  చెబుతున్నారు. వీటిని ఆడేటప్పుడు ఓ కల్పిత ప్రపంచంలోకి అడుగుపెడతారు. అందులోనే ఉన్నామని ఫీల్ అయ్యి ఉంటారు. మొదట్లో స్కూల్‌కు వెళ్లకపోవడం, తినకపోవడం, పూర్తిగా ఆ కొరియన్స్‌కు అడిక్ట్ అయిపోవడం వంటివి చేస్తారు. ఈ గేమ్ ఆడవద్దని చెప్పినా ఎవరి మాట వినే పొజిషన్‌లో ఉండరని నిపుణులు అంటున్నారు. ఇలాంటి గేమ్స్ వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. పిల్లలు మొబైల్ యూజ్ చేయకుండా తల్లిదండ్రులు చూడాలి. లేదా వారు మొబైల్ యూజ్ చేసేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలి. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం.

ఇది కూడా చూడండి: Donald Trump : నీ ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉండదు.. జర్నలిస్టుపై ట్రంప్ ఫైర్!

Advertisment
తాజా కథనాలు