/rtv/media/media_files/2026/02/18/supreme-court-2026-02-18-21-15-02.jpg)
Supreme Court
మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వారి దుస్తులను పట్టుకొని లాగినా, వక్షోజాలు తాకిన అత్యాచార యత్నం కిందకే వస్తుందంటూ పేర్కొంది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 2021 నవంబర్లో యూపీలోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన కూతురు (11)తో కలిసి బంధువుల నుంచి ఇంటికి వస్తోంది. ఈ క్రమంలోనే వాళ్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికను ఇంటి దగ్గర దింపుతామంటూ నమ్మించారు.
Also Read: ఇండియా ఇజ్జత్ తీసిన యూనివర్సిటీ.. సోషల్ మీడియాలో చైనా డాగ్ రోబోట్ రచ్చ రచ్చ
బైక్పై ఎక్కించుకుని మార్గమధ్యంలో ఆమెను అసభ్యంగా తాకుతూ కల్వర్టు కిందకు తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే బాలిక అరవడంతో అటుగా వెళ్తున్న వారు వాళ్లని గమనించారు. దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే గతేడాది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. మహిళ దుస్తులను లాగడం, వక్షోజాలను తాకినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదని కోర్టు ఈ కేసును కొట్టివేసింది.
Also Read: శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు.. మరీ భారత్లో పరిస్థితి ఏంటి ?
అయితే ఈ తీర్పు సమాజంలోకి తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని, ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పలువురు అభ్యర్థనలు చేశారు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు గత విచారణలో విచారం వ్యక్తం చేసింది. ఆ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. తాజాగా దీనిపై మరోసారి విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు అమ్మాయి దుస్తులను లాగడం, వక్షోజాలు తాకడం లాంటి చర్యలు కూడా అత్యాచార యత్నం కిందకే వస్తాయని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేమని పేర్కొంటూ గతంలో ఆ కోర్టు జారీ చేసిన ఆదేశాలను కొట్టేసింది.
Follow Us